ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భరోసా దక్కక.. వేలాది మంది రైతుల వేదన.. !

ఏటా సాగులో పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడాన్ని లక్ష్యంగా గత ఖరీఫ్ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నాయి. పీఎం కిసాన్ సమన్ యోజన, వైఎస్సార్ రైతు భరోసా పేరట 13500 చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. అయితే సాంకేతిక చిక్కులతో వేలాదిమంది ఈ సాయానికి దూరమవుతున్నారు. బ్యాంకు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా భరోసా దక్కటం లేదు.

bharosa scheme
bharosa scheme

By

Published : Dec 10, 2020, 11:43 AM IST

విశాఖ జిల్లాలో 5.85 లక్షల రైతు ఖాతాలున్నాయి. వీరిలో పెద్దరైతులతో పాటు, ఆయా కుటుంబాల్లో ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లిస్తున్న ఖాతాలను మినహాయించి 3.69 లక్షల మంది రైతు భరోసాకు అర్హులుగా గుర్తించారు. ఈ ఏడాది కరోనా కష్టకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌లోనే కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు సాయాన్ని ఇచ్చేసింది. తర్వాత మరో రెండు విడతల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.291.42 కోట్లను అన్నదాతల ఖాతాలకు సర్దుబాటు చేశాయి. ఇదంతా బాగానే ఉన్నా వేలాది మంది ఇంకా వేదన చెందుతూనే ఉన్నారు. 20,418 మంది కర్షకుల ఖాతాలకు భరోసా సొమ్ములు చేరలేదు. సాంకేతిక సమస్యలతో పాటు రెవెన్యూ, వ్యవసాయ శాఖలు, బ్యాంకర్ల సమన్వయ లోపం కారణంగా అన్నదాతలు నష్టపోతున్నారు. వచ్చే నెల మరోవిడత సాయం అందనుండడంతో ఆలోగా తమ సమస్యలను పరిష్కరించి భరోసా అందేలా చూడాలని కోరుతున్నారు.

సాగులో పెరుగుతున్న పెట్టుబడుల దృష్ట్యా అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో గత ఖరీఫ్‌ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాయి. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన, వైఎస్సార్‌ రైతు భరోసా పేరిట ఏటా రూ.13,500 చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తున్నాయి. అయితే సాంకేతిక చిక్కులతో వేలాదిమంది ఈ సాయానికి దూరమవుతున్నారు. బ్యాంకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా భరోసా దక్కడం లేదు.

తిప్పుతున్నారు..

రైతు భరోసా పథకం ప్రారంభం నుంచి పెట్టుబడి సాయం అందడం లేదు. సచివాలయానికి వెళ్లి అడిగితే బ్యాంకులో సమస్య ఉందంటున్నారు. బ్యాంకుకు వెళ్తే ఆధార్‌ మ్యాపింగ్‌ అవ్వలేదు, మీసేవలో బయోమెట్రిక్‌ చేయించమన్నారు. అక్కడ బయోమెట్రిక్‌ వేసి సచివాలయానికి పత్రాలన్నీ అందజేసినా భరోసా సొమ్ములు మాత్రం అందలేదు. - ఎ.గోపి, వమ్మవరం, ఎస్‌.రాయవరం మండలం

అన్నీ సక్రమంగానే ఉన్నా..

మొదట్లో నా ఖాతాకు ఆధార్‌ తప్పుగా లింకు అయిందన్నారు. నాకు రావాల్సిన డబ్బులు వేరొకరికి వెళ్లిపోయాయి. సరిచేయించుకున్నాక ఒకసారి డబ్బులు వచ్చాయి. తర్వాత నుంచి మరి రాలేదు. ఎకరంన్నర భూమి సాగు చేస్తున్నాను. భూమి వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. అన్నీ సరిగానే ఉన్నా డబ్బులు మాత్రం ఎందుకు రాలేదో తెలియడం లేదు. సచివాలయానికి వెళ్లి పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్‌ జెరాక్స్‌లన్నీ ఇచ్చాను. ఆన్‌లైన్‌ చేసి పంపించాం.. డబ్బులు వస్తాయని చెబుతున్నారు. కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది.- పల్లా శ్రీను, ఎల్‌బీ అగ్రహారం, బుచ్చెయ్యపేట మండలం

అందరికీ జమవుతాయి..

వివిధ సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన అర్హుల ఖాతాలన్నింటికీ సాయం సొమ్ములు అందుతాయి. చాలావరకు ఖాతానంబర్లకు తప్పుగా ఆధార్‌ సీడింగ్‌ జరగడం వల్ల ఈ సమస్య వచ్చింది. దీనిపై మండల స్థాయిలో వ్యవసాయ సిబ్బంది ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. ఆధార్‌ మ్యాపింగ్‌ సమస్య పరిష్కారం అయిన వెంటనే రైతుల ఖాతాల్లో భరోసా సొమ్ములు జమవుతాయి. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు.- లీలావతి, జేడీ, వ్యవసాయ శాఖ

ఇదీ చదవండి:ఏలూరు వింత వ్యాధి ఘటనలో మూడుకు చేరిన మృతులు

ABOUT THE AUTHOR

...view details