రైతులకు మద్దతుగా విశాఖలో వామపక్షాలు భారత్ బంద్ నిర్వహించాయి. వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
విశాఖ - కోల్కత్తా జాతీయ రహదారిపై వామపక్షాల నిరసనతో... మద్దిలపాలెం వద్ద జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పాడేరులో ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. విశాఖ ఏజెన్సీలో వామపక్షాలు, గిరిజన సంఘం, గిరిజన ఐకాస సంఘం సంయుక్తంగా బంద్కు మద్దతిచ్చాయి. పాడేరులో వ్యాపారులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. నర్సీపట్నంలో సబ్ డివిజన్లో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. విశాఖ మన్యంతో పాటు విశాఖ, చోడవరం, తుని, అనకాపల్లి వెళ్లాల్సిన బస్సు సర్వీసులను నిలిపివేశారు.