విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం ఎం.కోటపాడు వద్ద పోలీసులు భారీస్థాయిలో గంజాయి పట్టుకున్నారు. మాడుగుల ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా.. కారులో తరలిస్తున్న సరుకును స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనంతో పాటు కారులో తరలిస్తున్న సుమారు 6లక్షల 10 వేల రూపాయల విలువైన 310 కేజీల గంజాయిని గుర్తించారు. జి. మాడుగులలో కొనుగోలు చేసి, మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు నిందితులు తెలిపారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న కారుకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ బోర్డు తగిలించి గంజాయి రవాణా చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 వేల 600 నగదు, 4 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టివేత - visakha
విశాఖ మన్యం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి పట్టివేత