ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇలా చేస్తున్నారా.. అయితే మీ కెరీర్​ కొంప మునిగినట్లే..! - Career Advice

Career Advice : కెరీర్​లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలనే తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ ఆ క్రమంలోనే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇవి కావాలని చేయకపోయినా మీ ప్రవర్తన వల్ల మీకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అందుకే ప్రవర్తన తీరును గమనించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Career Advice
Career Advice

By

Published : Nov 7, 2022, 11:05 AM IST

Career Advice : కెరీర్‌లో ఉన్నతస్థాయికి వెళ్లాలని ఎవరికుండదు? దానికోసం కష్టపడుతుంటాం కూడా. అయితే ఈ ప్రక్రియలో ప్రవర్తనదీ ప్రధాన పాత్రే! దాన్నీ గమనించుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే ప్రమాదమంటున్నారు.

  • ఏమరుపాటో, తొందరపాటులో చూసుకోకపోవడమో.. కారణమేదైతేనేం తప్పులు సాధారణమే. కావాలని ఎవరూ చేయరు నిజమే. అయినా బాధ్యత తీసుకోక తప్పదు. పని చేస్తేనే పొరపాట్లు వస్తాయి. వాటిని అంగీకరించినప్పుడే పాఠాన్నీ నేర్చుకోగలుగుతారు. కాబట్టి, దాన్నో అవమానంగా తీసుకొని ఇతరులపై నెట్టే ప్రయత్నం చేయకండి.
  • పని చేసేచోట నిరూపించుకోవాలి అనుకోవడం మంచిదే. ఇంట్లో చేస్తున్నాంగా.. ఆఫీసూ అలాగే అనుకొని అన్నీ సొంతంగా చేసేయాలన్న తాపత్రయమొద్దు. పనిభారం పంచుకుంటే ఎంత సులువవుతుందో.. ఒక్కరే మీద వేసుకుంటే అంత ఒత్తిడికి కారణమవుతుంది. దాని ఫలితమే పనిలో తప్పిదాలు, నాణ్యతా లోపాలు. నమ్మకస్తులను చుట్టూ ఉండేలా చూసుకోండి. వాళ్లతో పంచుకోండి. పనీ సులువవుతుంది, విజయాలూ త్వరగా దక్కుతాయి.
  • రోజూ సమయం కంటే ముందొచ్చి కూర్చోమని ఎవరూ అడగరు. కానీ తరచూ ఆలస్యాన్ని మాత్రం ఎవరూ సహించలేరు. ఇల్లు, పిల్లల బాధ్యతలు ముగించుకొని రావడానికి సమయం పడుతుంది. నిజమే.. ఎప్పుడైనా అంటే సరే! కానీ తరచూ జరుగుతోంటే ఇతరులకీ ఇబ్బంది. సమయ పాలనని నియమంగా పెట్టుకోవాలి.
  • ఆరోగ్యం బాలేదనో, ప్రతిదీ పద్ధతిగా జరగట్లేదనో తరచూ చెబుతోంటే ఎలా అనిపిస్తుంది? విసుగొస్తుంది కదా! మీరూ అలా చేయకండి. తరచూ ప్రతికూలంగా, ఫిర్యాదు చేస్తూ మాట్లాడేవాళ్లని ఎవరూ భరించలేరు. దీంతో దూరం పెడుతుంటారు. ఇక ఎదిగేదెలా?
  • నలుగురూ పనిచేసే చోట అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటాయా? అలాగని మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లందరూ శత్రువులనుకోవద్దు. ఆ కోపాన్ని మనసులో ఉంచుకొని వాళ్లేం చెప్పినా వ్యతిరేకించడం, ప్రతి విషయానికీ ఫిర్యాదు చేయడం లాంటివీ చేయొద్దు. బాస్‌సహా ప్రతి ఒక్కరితోనూ సత్సంబంధాలు నెరపండి. ఏ విషయంలోనైనా వాదించుకున్నా తిరిగి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అప్పుడే ముందుకు సాగగలరు.

ABOUT THE AUTHOR

...view details