విశాఖ జిల్లా నర్సీపట్నం వ్యవసాయ సబ్ డివిజన్లో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలకు ఒకేసారి జలాశయాల్లో నీరు చేరింది. దీంతో నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం రోలుగుంట, మాకవరపాలెం, రావికమతం మాడుగుల తదితర మండలాల్లో వ్యవసాయ పనుల్లో వేగం పెంచారు. అంతేగాక నాతవరం మండలం జలాశయంలో వరద నీరు చేరడంతో.. డివిజన్లోని పలు ప్రాంతాల్లో నాట్లు వేయడానికి రైతులు ఉత్సాహం చూపుతున్నారు. నర్సీపట్నం వ్యవసాయ శాఖకు సంబంధించిన 13 వేల ఎకరాల్లో నాట్లు వేయడానికి రైతులు సన్నద్ధమయ్యారు.
జలాశయాలకు కొత్తశోభ... పొలాల్లో వరినాట్ల కోలాహలం
వర్షాల రాకతో జలాశయాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. అంతే ఉత్సాహాంతో రైతన్నలు వరినాట్లను మొదలుపెట్టారు.
because of rain fall the reserviors are fulled with water at narsipatnam in vishakapatnam district