మంచుకు కంచె కట్టారా..? అన్నట్టు చెరువులవేనం అందాలు పర్యటకులకు కనువిందు చేస్తున్నాయి. మంచుతో కప్పబడిన కొండకోనలు కైలాసాన్ని తలపిస్తున్నాయి. మంచుతో నిండిన అందాలు చూసేందుకే సుదూర ప్రాంతాల నుంచి పర్యటకులు తరలివస్తారు. ఏడాది పొడువునా పచ్చని అందాలతో కనువిందు చేసే విశాఖ మన్యాన్ని ఆంధ్రాఊటీగా పిలుస్తారు. విశాఖ మన్యంలో లంబసింగిని మించిన అందాలను తనలో నింపుకొని... పర్యటకుల దృష్టిని ఆకర్షిస్తోంది చెరువువేనం.
ఆంధ్రాఊటీలో మంచు అందాల విందు..! - విశాఖ మన్యంలో లంబసింగిని మించిన అందాలు
వయ్యారాల వన్నెల ప్రకృతి... మంచు చీర కట్టుకొని మనోహరంగా ముస్తాబవుతుంది. పచ్చదనాన్ని పరుచుకున్న ఎత్తైన కొండలు... ఆ అందాలను తనలో కలుపుకున్న మంచు సోయగాలు పర్యటకులను పరవశింపజేస్తున్నాయి. ఆ సుమనోహర ఆంధ్రాఊటీ అందాలను ఓసారి తిలకించి పులకిద్దామా..!
ఆంధ్ర ఊటీలో మంచు అందాల విందు
లంబసింగి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై ఉన్న ఈ ప్రాంతం... పర్యటకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇక్కడికి చేరుకునేందుకు రహదారి లేకపోయినా... మంచు అందాలను చూసేందుకు పర్యటకులు వస్తున్నారు. కొండకోనల్లో కాలినడకన చెరువులవేనం చేరుకున్న ప్రకృతి ప్రేమికులకు... సముద్ర తీరాన్ని తలపించే అందాలు దర్శనమిస్తున్నాయి.
ఇవీ చూడండి...'అడవి కాల్చేయమని డబ్బులిచ్చిన ప్రముఖ హీరో!'