విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాంకు నాలుగు కిలోమీటర్ల దూరంలో జారుపనుకు జలపాతం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు జలపాతం పరిసర ప్రాంతాలు పచ్చదనంతో స్వాగతం పలుకుతున్నాయి. ఈ అందాలను వీక్షించేందుకు సమీప ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. అయితే జలపాతానికి చేరుకోవటానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవటంతో పర్యటకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, రహదారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కోనాంలో అబ్బురపరుస్తున్న అందాల జలపాతం - విశాఖపట్నం జిల్లా తాజా వార్తలు
చుట్టూ పచ్చని కొండలు.. కొండల్లో నుంచి జాలువారుతున్న జలపాతం... ఈ ప్రకృతి సహజ అందాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ అద్భుత జలపాతాన్ని చూడాలంటే విశాఖపట్నం జిల్లా కోనాంకు వెళ్ళాల్సిందే..!
కోనాంలో అబ్బురపరుస్తున్న అందాల జలపాతం
Last Updated : Oct 24, 2020, 10:57 AM IST