ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ బీచ్​లో ఉయ్​ ఆర్ హియ‌ర్ ఫ‌ర్ యూ అంటున్న పోలీసులు - విశాఖ‌లో రామకృష్ణ బీచ్ వద్ద బీచ్ కంట్రోల్ రూమ్ ప్రారంభ

విశాఖ‌ ఆర్​కేబీచ్​లో ఉయ్​ ఆర్ హియ‌ర్ ఫ‌ర్ యూ పేరిట బీచ్ కంట్రోల్ రూమ్ ప్రారంభ‌మైంది. ఇందులో పోలీసు సిబ్బంది ఎల్లవేళల ఫిషింగ్ హార్బర్ నుంచి... భీమిలి వరకు డ్యూటీలో ఉన్న సిబ్బందికి సంధానకర్తలుగా వ్యవహరిస్తారు.

Beach control room
ఉయ్​ ఆర్ హియ‌ర్ ఫ‌ర్ యూ పేరిట విశాఖలో బీచ్ కంట్రోల్ రూమ్

By

Published : Jan 14, 2021, 7:29 AM IST

విశాఖ‌లోని రామకృష్ణ బీచ్ వద్ద కాళీమాత దేవాలయ సమీపంలో ఉయ్​ ఆర్ హియ‌ర్ ఫ‌ర్ యూ పేరిట బీచ్ కంట్రోల్ రూమ్ ప్రారంభ‌మైంది. న‌గ‌ర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఆలోచ‌న మేర‌కు బీచ్ రోడ్​లో ప్రారంభించిన కొత్త చర్యల్లో భాగంగా ఈ కార్యలయాన్ని ప్రారంభించారు. దీనిపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు డ్యూటీలో ఉన్న సిబ్బంది అందరికి ఈ కంట్రోల్​ రూమ్​ ఆఫీసర్లు సంధానకర్తలుగా వ్యవహరిస్తారు. వీరి వద్ద ఉన్నసాంకేతికత సహాయంతో బీచ్ రోడ్​లో వివిధ ప్రాంతాల్లో విధుల్లో ఉన్న లా అండ్ ఆర్డర్, ఏ.ఆర్, ట్రాఫిక్, మెరైన్, కమ్యూనిటీ గార్డ్స్ ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఈ కంట్రోల్ రూమ్ వల్ల బీచ్ సందర్శకులకు మరింత రక్షణ కలిగించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, సముద్రంలోకి స్నానాలకు దిగే సందర్శకుల పర్యవేక్షణకు ఇది ప‌ని చేస్తుంది.

ఇదీ చదవండీ..వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ తవ్వకం పనులు పూర్తి

ABOUT THE AUTHOR

...view details