ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ఆప్షన్​లూ.. విశాఖ వైపే మొగ్గు - పాలనా రాజధానిగా విశాఖ

ఏపీ రాజధాని ఒకచోటే కేంద్రీకృతం చేయకుండా విస్తరణ నమూనా అనుసరించాలని బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రెండు ఐచ్ఛికాలను సూచించినా....విశాఖ వైపే మొగ్గుచూపింది.

Bcg report suggests vizag as executive capital
పాలనా రాజధానిగా విశాఖే ఉత్తమని బీసీజీ నివేదిక
author img

By

Published : Jan 4, 2020, 6:32 AM IST

పాలనా రాజధానిగా విశాఖే ఉత్తమని బీసీజీ నివేదిక
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ స్థానికంగా ఉన్న ఆకాంక్షలు, మౌలిక వనరులు, జనాభా, చారిత్రక అంశాలు ఆధారంగా పాలన వికేంద్రీకరణకు సిఫార్సులు చేసినట్టు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని నగరాలను జనాభా, మౌలిక వనరుల ప్రాతిపదికన అధ్యయనం చేసినట్టు వివరించింది. ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాల్లో ఉన్న విశాఖ, రాజమండ్రి, కాకినాడ, అలాగే దక్షిణ జిల్లాల్లో విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలను అధ్యయనం చేసినట్టు తెలిపింది. సీమ ప్రాంతంలో కడప, తిరుపతి నగరాలను అధ్యయనం చేసినట్టు స్పష్టం చేసింది.

అన్ని అనుకూలతలు విశాఖకే..!

విశాఖలో 1.7 మిలియన్లు, విజయవాడలో 1 మిలియన్ జనాభా ఉందని.. జనాభా పరంగా అన్ని అనుకూలతలు ఉన్న ప్రాంతంగా విశాఖను మొదటి ప్రాధాన్యతగా బీసీజీ ఎంపిక చేసింది. విశాఖ, కర్నూలు, విజయవాడల్లో సామాజికంగా, భౌతికంగా మౌలిక సదుపాయాలు ఉన్నాయని స్పష్టం చేసింది. హైకోర్టు, అసెంబ్లీలను మినహాయిస్తే ప్రభుత్వ విభాగాలను ఆరు భాగాలుగా వర్గీకరణ చేసి వాటిని ఈ ప్రాంతాలకు విస్తరించవచ్చని నివేదికలో పేర్కొంది.

మొదటి ప్రతిపాదన

  • విశాఖలో :సచివాలయం, రాజ్ భవన్, సీఎం కార్యాలయాలు, ఏడు శాఖలకు చెందిన హెచ్​​ఓడీలు, పరిశ్రమలశాఖ, పర్యాటక శాఖతో పాటు ప్రజలతో సంబంధంలేని శాఖలలో మొత్తం 15 విభాగాలు, అసెంబ్లీ, హైకోర్టు బెంచ్​ ఉండవచ్చని ప్రతిపాదనలు చేసింది.
  • విజయవాడలో : అసెంబ్లీతో పాటు విద్యాశాఖ, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన పంచాయతీరాజ్, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవచ్చని బీసీజీ ప్రతిపాదించింది.
  • కర్నూలులో :హైకోర్టు, రాష్ట్ర న్యాయకమిషన్లు, క్వాజీ జ్యూడీషియల్ సంస్థలు, అప్పిలేట్ ట్రిబ్యూనళ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.


రెండో ప్రతిపాదన

  • విశాఖలో : సచివాలయం, గవర్నర్ కార్యాలయం, సీఎం కార్యాలయంతో పాటు అన్ని విభాగాల హెచ్​ఓడీలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రతిపాదించింది.
  • అమరావతిలో : అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్
  • కర్నూలులో : హైకోర్టు, న్యాయ కమిషన్లు ఉండేలా చూడాలని బీసీజీ ప్రతిపాదించింది.

అమరావతిలో 55 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలకు స్థలాన్ని గతంలో ప్రతిపాదించారని మొదటి ప్రతిపాదనల నిర్మాణం కోసం 4,645 కోట్లు ఖర్చు అవుతుందని ఇక రెండో ప్రతిపాదన కోసం రూ.2500-3000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

ఆ నగరాలు విఫలమయ్యాయి

రాజధాని ప్రాంతాన్ని గ్రోత్ ఇంజిన్​గా భావిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న అంశంపై కూడా అధ్యయనం చేసినట్టు బోస్టన్ గ్రూప్ వెల్లడించింది. 1982 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా నూతనంగా నిర్మించిన నగరాలు ఏవీ తమ ఆర్థిక లక్ష్యాలను సాధించలేదని స్పష్టం చేసింది. పుత్రజయ లాంటి నగరాలు 20 ఏళ్ల తర్వాత కూడా సరైన ఫలితాలు, అభివృద్ధి ప్రమాణాలు సాధించలేక పోయాయని బీసీజీ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి లక్ష్యాలను కూడా బేరీజు వేసి చూసినట్టు వెల్లడించింది. దోలేరా లాంటి నగరంలో 10 వేల మంది కోసం వేల కోట్ల రూపాయల వెచ్చించారని ఇది పూర్తిగా సఫలం కాలేదని నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం అమరావతి కూడా తక్కువ జనాభా కోసం ఎక్కువ నిధులు వెచ్చించే నగరంగా బీసీజీ అభిప్రాయపడింది.

రాయలసీమలో లక్షా 76 కోట్ల ప్రాజెక్టుల ప్రతిపాదనలు

మరోవైపు రహదారులు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చని బీసీజీ ప్రతిపాదించింది. జిల్లాలు, ప్రాంతాలవారీగా ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమలను విశదీకరించింది. ప్రధానంగా రాష్ట్రంలో మరింతమెరుగైన రహదారుల అనుసంధానం కోసం 6 ఎక్స్​ప్రెస్ దారులను ప్రతిపాదించింది. గోదావరి- పెన్నా నదుల అనుసంధానం చేయాలని సూచించింది. రాయలసీమలో కాల్వల వెడల్పు పెంచే ప్రాజెక్టుల కోసం 1 లక్షా 76 వేల కోట్లతో ప్రతిపాదనలు చేసింది.

ఇదీ చదవండి :

భవిష్యత్​లో ఏపీ రాజధాని అంటే... మూడు పేర్లు చెప్పాలా..?

ABOUT THE AUTHOR

...view details