Battle Between YV vs Vijayasai for Dasapalla Lands: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, అంతర్యుద్ధాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖపట్నంలో నిషేధిత జాబితా నుంచి బయటపడిన దసపల్లా భూముల కోసం అధికార పార్టీ ముఖ్య నేతల మధ్య నడుస్తోన్న పోరు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం తాడేపల్లికి చేరడంతో.. ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తను ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించడంతో చర్చనీయాంశంగా మారింది.
Visakha Dasapalla Land Issue: నిషేధిత జాబితా 22ఏ నుంచి బయటపడిన దసపల్లా భూములపై వైసీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. విశాఖ మధ్యనున్న ఈ భూముల వ్యవహారంలో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఆ భూములు రాణి కమలాదేవికి చెందినవని.. ఆమె వారసుల నుంచి కొనుగోలు చేశామంటూ ఇప్పటికే దక్కించుకున్న ఓ వర్గానికి విజయసాయి సహకరిస్తుంటే.. ఆ భూముల్లో రాణి సాహిబా ఆఫ్ వాద్వాన్ వారసుల పేరుతో బోర్డులు వెలిశాయి. వీరికి వైవీ మద్దతుగా నిలిచారు. దీంతో ఈ పంచాయితీ కాస్త ఇటీవల తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది.
Dasapalla land scam: కట్టబెట్టాలన్న కంగారే తప్ప.. కాపాడాలనే తపనేదీ?
Mutual Complaints for Dasapalla Lands:ఈ క్రమంలో ఎన్నో వివాదాల మధ్య దసపల్లా భూముల్లో 15 ఎకరాలను ఇటీవల ఓ వర్గం దక్కించుకుంది. వాటి విలువ దాదాపు రూ.2వేల కోట్లుటుందని అంచనా. ఇందులో కొంత భూమిపై రాణి కమలాదేవి వారసుల తరఫు నుంచి తనకూ హక్కు ఉందంటూ.. ఓ వ్యక్తి కోర్టు ఆశ్రయించారు. అయితే..ఆ వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో భూమి కోసం యత్నిస్తున్నారంటూ.. రాణి కమలాదేవి పేరుతో ఈ ఏడాది కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు రాణి కమలాదేవి చేయలేదని.. ఆమె సంతకం ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా, ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతిస్తున్న వర్గంలోని కీలక వ్యక్తే సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఫోర్జరీ సంతకం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని.. దసపల్లా భూముల్లోని తన స్థలాన్ని అప్పగించాలని వైవీ వర్గానికి చెందిన వ్యక్తి ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.