ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల పెన్షన్లు పెంచాలి - విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు వార్తలు

విశాఖలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ... నిరసన ప్రదర్శన నిర్వహించారు.

bank pensioners dharna at vishakapatnam
విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల ధర్నా

By

Published : Jan 27, 2020, 10:50 AM IST

విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల ధర్నా

విశ్రాంత బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ పెంచాలంటూ... అఖిల భారత బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సమాఖ్య విశాఖలో ధర్నా చేపట్టింది. ఆంధ్ర బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. బ్యాంకు యాజమాన్యాలు తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం రిటైర్ అయిన ఉద్యోగి పెన్షన్ ఎంత ఉందో... ఇప్పటికీ అంతే కొనసాగించటం శోచనీయమని వాపోయారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ పెన్షన్లు సరిపోక కుటుంబ పోషణ భారంగా మారుతోందని తెలిపారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా తమ పెన్షన్ కూడా పెంచాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details