ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటీకరణ వద్దు.. నిర్ణయం వెనక్కు తీసుకోండి - విశాఖ జిల్లా వార్తలు

బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. దీనికి ప్రజాసంఘాల నుంచి మద్దతు లభించింది.

banks bandh agitations in Visakhapatnam
ప్రైవేటీకరణ వద్దు.. నిర్ణయం వెనక్కు తీసుకోండి

By

Published : Mar 15, 2021, 4:49 PM IST

బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ విశాఖలో ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న బ్యాంకులను ప్రైవేట్​పరం చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో లేకుండాపోతాయని బ్యాంక్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

నష్టాల పేరుతో ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతోన్న కేంద్ర ప్రభుత్వం.. బడా వ్యాపారవేత్తల నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయల మొండి బకాయిలు రాకపోవడం వల్లే నష్టాలకు కారణమని గ్రహించాలన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి.. డబ్బులు వసూలు చేయాలని నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బ్యాంకులను మాత్రం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ప్రజాసంఘాల మద్దతు..

బ్యాంక్ ఉద్యోగులు చేపడుతున్న సమ్మెకు విశాఖ జిల్లా దేవరాపల్లిలో ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న, సీఐటీయూ మండల కార్యదర్శి రాజు, ఎస్​ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దొర ఆధ్వర్యంలో దేవరాపల్లి స్టేట్ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు.

కీలక రంగాలు ప్రైవేటుపరం..

ఇప్పటికే బీమా సంస్థలు, బీఎస్​ఎన్​ఎల్​, ఎయిర్ ఇండియా, రైల్వే, స్టీల్ ప్లాంట్ వంటి కీలక రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం అడుగులు వేస్తుండగా.. ప్రస్తుతం బ్యాంకులకు అదే గతి పట్టిస్తున్నారని వారు ఆరోపించారు.

ఇదీ చదవండి:

విశాఖ 'దక్షిణం'లో ఓటర్ల విలక్షణ తీర్పు

ABOUT THE AUTHOR

...view details