ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకులోయలో విదేశీయులు... "సంక్షేమం"పై ఆరా - టెలిమెడిసిన్ తీరు

విశాఖ మన్యంలోని సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులను పరిశీలించేందుకు బంగ్లాదేశ్ కు చెందిన ఉన్నతాధికారుల బృందం అరకులోయలో పర్యటించింది.

అరకులోయలో పర్యటించిన బంగ్లాదేశ్ అధికారులు

By

Published : May 31, 2019, 11:50 PM IST

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తమ దేశంలో అమలు చేసేందుకు...బంగ్లాదేశ్ కు చెందిన ఉన్నతాధికారులు బృందం విశాఖ మన్యం అరకులోయలో పర్యటించారు. ఏజెన్సీలో అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి..తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మాతా శిశువులకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సౌకర్యాలు, కిశోర బాలికలకు రక్తహీనత లేకుండా తీసుకుంటున్న చర్యల పై వివరాలను అధికారులు వారికి వివరించారు. ఈ ఆరోగ్య కేంద్రాల పనితీరు గురించి, టెలిమెడిసిన్ తీరు, టెలికాన్ఫరెన్స్ లో వైద్యుడితో నేరుగా రోగులు సంభాషించే వెసులుబాటును అధికారులు ఈ సందర్భంగా వారికి తెలిపారు. అరకు కాఫీ అద్భుతంగా ఉందని బంగ్లాదేశ్ అధికారులు ప్రశంసించారు. గిరిజన మ్యూజియాన్ని తిలకించి గిరిజన సంప్రదాయ ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు.

అరకులోయలో పర్యటించిన బంగ్లాదేశ్ అధికారులు

ABOUT THE AUTHOR

...view details