విశాఖ సాగర తీరంలోని తెన్నేటి పార్కు సమీపంలోకి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌక నుంచి ఇంధనం తీసివేసేందుకు నిపుణులు సన్నాహాలు ప్రారంభించారు. ముందుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం సామాగ్రిని చేరవేసేందుకు వాహనం వెళ్లేలా జేసీబీతో పనులు చేయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో మునిగిన లాంచీని వెలికి తీసిన బృందం కూడా సహాయమందించేందుకు సిద్ధమైంది.
బంగ్లాదేశ్ నౌకను తిరిగి పంపేందుకు మొదలైన సహాయక చర్యలు - విశాఖ తీరంలో బంగ్లాదేశ్ నౌక
విశాఖ తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌకను తిరిగి పంపేందుకు కోస్ట్‌గార్డ్ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. ముందుగా విద్యుత్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.

విశాఖ తీరానికి కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ నౌక