విశాఖపట్నంలోని తూర్పు నావికాదళానికి (ఈఎన్‌సీ) చెందిన జెట్టీలోకి ఆదివారం బంగ్లాదేశ్‌కు చెందిన నౌక ‘బీఎన్‌ఎస్ సముద్ర అవిజన్’ చేరుకుందని నేవీవర్గాలు వెల్లడించాయి. ఇండో- పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తవడంతో చేపడుతున్న స్వర్ణ విజయ్‌వర్ష్ వేడుకల్లో భాగంగా ఈ నౌక భారత్‌లో అయిదు రోజుల పాటు పర్యటించి... ఇక్కడి నౌకాదళంతో మమేకమవుతుందని పేర్కొన్నాయి.
BNS MARINE AVIATION: విశాఖ చేరిన బంగ్లాదేశ్ 'బీఎన్‌ఎస్ సముద్ర అవిజన్' నౌక - ap latest news
ఇండో- పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తవడంతో చేపడుతున్న స్వర్ణ విజయ్‌వర్ష్ వేడుకల్లో భాగంగా బంగ్లాదేశ్‌కు చెందిన నౌక విశాఖపట్నంలోని ఈఎన్‌సీకి చేరింది.
విశాఖ చేరిన బంగ్లాదేశ్ 'బీఎన్‌ఎస్ సముద్ర అవిజన్' నౌక
బంగ్లాదేశ్ జాతీయ నేత బహదూర్ షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయంతి స్మారకంగా భారత్ నేవీతో వృత్తిపరమైన మమేకం, క్రాస్‌డెక్ వంటి అంశాలతో భాగస్వామ్యం కానుందని స్పష్టం చేశాయి. తొలుత జెట్టీ వద్ద నౌకకు భారత్ నేవీ బ్యాండుతో సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం ఈఎన్‌సీ చీఫ్, వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్‌తో బంగ్లాదేశ్ నౌక సీవో భేటీ అయ్యారు.
ఇదీ చూడండి:Bramhotsavalu:శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు ముస్తాబు