బంగ్లాదేశ్‌కు చెందిన బీఎన్ఎస్ సౌముద్ర అవిజాన్ అనే నౌక.. విశాఖపట్నం తూర్పు నౌకాదళానికి చేరుకుంది. భారత్-బంగ్లా దేశాల నౌకా దళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్ఠం చేసుకునేందుకే నాలుగు రోజుల పాటు బస చేసేందుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ గొర్మడే, ఇతర నౌకాదళ అధికారులు సంప్రదాయంగా బంగ్లా నౌకకు స్వాగతం పలికారు. ఈ నౌక అధికారి కమాండర్ ఎం.జహీరుల్ హక్, తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ గొర్మడేతో భేటీ అయ్యారు. బంగ్లాదేశ్‌కు సహకారం అన్ని విభాగాల్లో ఉంటుందని ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ చీఫ్ స్పష్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెండు దేశాల నేవీల మధ్య క్రీడా, వృత్తినైపుణ్య ప్రదర్శనలు జరగనున్నట్లు తెలిపారు.
తూర్పు నౌకాదళానికి చేరుకున్న బంగ్లా నౌక - vihaka
భారత్-బంగ్లా నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేందుకు బంగ్లా నౌక తూర్పు నౌకాదళానికి చేరుకుంది.
బీఎన్ఎస్ సౌముద్ర అవిజాన్ నౌక