జీవో నెం 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రాష్ట్ర గిరిజన సంఘాలు గిరిజన ప్రాంతాల్లో బుధవారం నుంచి 48 గంటల పాటు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం నుంచే జేఏసీ నాయకులు, గిరిజనులు రహదారులపైకి వచ్చి ఆందోళన చేశారు. రహదారిపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. గూడెంకొత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు, బస్సులు, ద్విచక్రవాహనాల రాకపోకలు నిలిపివేశారు. చింతపల్లిలో జరిగే బుధవారం జరిగే వారపు సంత నిలిచిపోయింది.
జీవో నెం 3 రద్దుపై గిరిజన ప్రాంతాల్లో బంద్ - visakha tribal latest news
జీవో నెం 3ను రద్దు చేయడాన్ని నిరసిస్తూ గిరిజన ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచే బంద్‌ను చేపట్టారు. జీవో నెం 3ను రద్దు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని జేఏసీ నాయకులు, గిరిజనులు డిమాండ్ చేశారు. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. రహదారులపైకి వచ్చి గిరిజనులు ఆందోళన చేశారు.
![జీవో నెం 3 రద్దుపై గిరిజన ప్రాంతాల్లో బంద్ bandh started in visakha tribal areas by tribal unions against go no 3 issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7649201-1028-7649201-1592373509055.jpg)
విశాఖ మన్యంలో ప్రారంభమైన బంద్