ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైజాగ్ టెక్నో పార్క్ విషయంలో క్విడ్ ప్రోకో జరిగింది: తెదేపా నేత బండారు - డేటా సెంటర్‌

Bandaru Satyanarayana comments on Jagan: వైజాగ్ టెక్నో పార్క్ విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని తెలుగుదేశం ఆరోపించింది. 2010 కి ముందు జరిగిన ఒప్పందాలు ఇప్పటికీ సేల్ డీడ్ లు కాలేదన్న తెదేపాకు చెందిన విశాఖ జిల్లా నేతలు రూల్స్ కి విరుద్ధంగా జగన్ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. అదానీ డేటా సెంటర్‌పై హఠాత్తుగా ప్రేమ పుట్టడానికే ఇదే కారణమన్నారు. దీనిపై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

Bandaru Satyanarayana
Bandaru Satyanarayana

By

Published : Nov 27, 2022, 11:47 AM IST

Bandaru Satyanarayana comments on Jagan: జగన్ గతంలో క్విడ్ ప్రో చేసి చాలా మందిని జైల్లో పెట్టించాడని,70 వేల మందికి ఉపాధి కోసం ఆదాని డేటా సెంటర్ తెచ్చామని, కాపులుప్పాడలో 89 ఎకరాలను ఎకరా కోటి రూపాయిలకు ఇచ్చామని... మూడేళ్ళుగా పట్టించుకోని దీనిపై జగన్​కి హఠాత్తుగా ప్రేమ పుట్టుకు వచ్చిందని ఇందులో భారీ కుంభకోణం చోటు చేసుకుందని తెదేపా ఆరోపించింది.

టీడీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి , ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు మాట్లాడుతూ అదానీ సెంటర్ కి కేటాయించిన 89 ఎకరాలు బదులు మధురవాడలో 130 ఎకరాలు పాత ధర కోటి రూపాయలకే ఇవ్వడమే ఇందులో రహస్యమని వివరించారు. ఈయేడాది జులై 6న సెల్ అగ్రిమెంట్, అదేరోజున సేల్ డీడ్ జరిగిపోవడం క్విడ్ ప్రో గా అనుమానం బలపడుతోందన్నారు. వైజాగ్ టెక్నో పార్క్ గా పేరు మారింది, భూమి మారిందని వివరించారు. ఈ కంపెనీకి కడపకు చెందిన పాకనాటి అంజిరెడ్డి జనరల్ మేనేజర్ గా ఉన్నారని, మా షరతులు వేరని, ఇపుడు ఎటువంటి కండిషన్స్ లేవని ఇది ముమ్మూటికి జగన్ క్విడ్ ప్రో నేనని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని, ఆదానితో జరిగిన సేల్ డీడ్ ని రద్దు చెయ్యాలన్నారు.

బండారు సత్యనారాయణ మూర్తి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details