విశాఖలోని హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్ భూములను బినామీల పేరుతో ఆక్రమించేందుకు వైకాపా నేతలు చూస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. వైకాపా నేతలు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. హయగ్రీవ భూములను ఆక్రమించి అందులో రియల్ ఎస్టేట్ వెంచర్ లు వేయాలని చూస్తున్నారని చెప్పారు. వయోవృద్ధుల కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు పదేళ్ల క్రితం నాటి ప్రభుత్వం హయగ్రీవ సంస్థకు భూమి కేటాయించిందన్నారు.
ఆ భూములపై వైకాపా నేతలు కన్నేశారు: మాజీ మంత్రి బండారు - హయగ్రీవా భూములపై వార్తలు
విశాఖలోని హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్ భూములపై వైకాపా నేతలు కన్నేశారని తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. బినామీల పేరుతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
బండారు సత్యనారాయణ