ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 8, 2021, 11:25 AM IST

ETV Bharat / state

దశాబ్దాలుగా ఎల్బీపట్నం సర్పంచ్​లుగా బండారు కుటుంబీకులు

పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైన నాటినుంచి.. దశాబ్దాలుగా ఆ గ్రామంలో బండారు వారి కుటుంబీకులే సర్పంచులగా ఎన్నికవుతూ వస్తున్నారు. రిజర్వేషన్ వల్ల రెండు దఫాలు మినహా.. అన్నిసార్లు సర్పంచి పదవి ఆ కుటుంబమే దక్కించుకుంటూ వస్తున్న ఆ గ్రామం.. విశాఖలోని చీడికాడ మండలం ఎల్బీపట్నం.

bandaru family is winning as sarpanch from lb patnam in vishaka district
దశాబ్దాలుగా ఎల్బీపట్నం సర్పంచిగా బండారు కుటుంబీకులే

విశాఖ జిల్లా చీడికాడ మండలం ఎల్బీపట్నం పంచాయతీ ఏర్పాటైన నాటి నుంచి.. బండారు వారి కుటుంబీకులు సర్పంచులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. రెండు సార్లు ఎస్సీ రిజర్వేషన్ మినహా అన్నిసార్లు సర్పంచులుగా.. ఆ కుటుంబమే పదవులు చేపడుతున్నారు.

మొదట బండారు కన్నంనాయుడు 35 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా ఎల్బీపట్నం సర్పంచిగా పనిచేశారు. దాంతో పాటు మాడుగుల సమితి వైస్ ప్రెసిడెంటుగా సేవలందించారు. తరువాత కాలంలో బండారు దేముడునాయుడు, బండారు లలితాదేవి, బండారు పాలవెల్లి సర్పంచులుగా పదవులు చేపట్టారు. రెండు దఫాలు మాత్రం ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆ పదేళ్లు మినహా.. మిగిలిన ప్రతిసారి బండారు వారి కుటుంబం నుంచే సర్పంచులుగా ఎన్నికవుతూ వస్తున్నారని బండారు దేముడు నాయుడు తెలిపారు. గ్రామంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సహకారంతోనే ఇన్నేళ్లు వారి కుటుంబంసభ్యులు సర్పంచులుగా ఎన్నికవుతున్నామన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా.. బండారు వారి కుటుంబం నుంచి సర్పంచి పోటీలో ఉన్నారు.

ఇదీ చదవండి:రేపు తొలిదశ ఎన్నికల పోలింగ్‌..విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details