తెదేపా హయాంలో ఉపాధి హామీ అమలు చేసిన తీరుకు కేంద్రం పురస్కారాలు ప్రదానం చేస్తే... జగన్ ప్రభుత్వం వాటికి బిల్లులను నిలిపివేసి దారుణంగా ప్రవర్తిస్తోందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... జిల్లా కలెక్టర్ తీరును తప్పుబట్టారు. కలెక్టర్ వినయ్ చంద్... నరేగా పనులకు నిధులు విడుదల చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఎమ్మెల్యేలకు ఇస్తామన్న రూ.50 కోట్లను నిలుపుదల చేసి... నరేగా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే నవరత్నాల అమలు కోసం విశాఖ జిల్లాలోని ప్రభుత్వ భూములను అమ్మడం ఏంటని ఆయన నిలదీశారు. గురువారం సబ్బవరం మండలంలోనే 1650 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్ముతామని జాయింట్ కలెక్టర్ ప్రకటించారని అన్నారు. ఇలా భూములను విక్రయిస్తూ పోతే భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'విశాఖ కలెక్టర్‌ది పక్షపాత ధోరణి' - బండారు సత్యనారాయణ వార్తలు
విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. జిల్లాలో భూ సమీకరణకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు సంబంధించి కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు.
బండారు సత్యనారాయణ