కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వివిధ పంట ఉత్పత్తులను డ్వాక్రా సంఘాల ద్వారా రాష్ట్రంలో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే కడప జిల్లాలో పండించిన అరటి పళ్లను వివిధ జిల్లాలకు తరలించి అక్కడ డ్వాక్రా సంఘాల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు విశాఖ జిల్లా రోలుగుంట, చోడవరం, బుచ్చి పేట, మాడుగుల, కె.కోటపాడు, దేవరపల్లి తదితర మండలాలకు డ్వాక్రా సంఘాలు విక్రయించేందుకు 40 టన్నులు అరటి గెలలను సరఫరా చేశారు. ఇందుకుగాను డ్వాక్రా సంఘాల సభ్యులు మార్కెటింగ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రోలుగుంట మండలంలో విక్రయాలకు శ్రీకారం చుట్టారు.
డ్వాక్రా సంఘాల ద్వారా అరటి పళ్ల విక్రయం - banana sale in ap
కొవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి కారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వివిధ పంట ఉత్పత్తులను డ్వాక్రా సంఘాల ద్వారా రాష్ట్రంలో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ జిల్లాలోని పలు మండలాల్లో డ్వాక్రా సంఘాలు అరటి పళ్లు విక్రయించేందుకు 40 టన్నుల అరటి గెలలను సరఫరా చేశారు.
డ్వాక్రా సంఘాల ద్వారా అరటి పళ్ల విక్రయం