విశాఖ జిల్లా చీడికాడ - పాడేరు మండలాలకు అనుసంధానంగా నిర్మించిన కోనాం - ఈదులపాలెం మార్గంలో రాయిపాలెం వద్ద విద్యుత్ స్తంభం స్థానంలో వెదురు కర్రను ఏర్పాటు చేశారు. ఇది రహదారి పక్కనే ఉంది.
ఏమాత్రం గాలి వీచినా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెదురు కర్ర ఉన్న ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.