సత్యసాయి బాలవికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం రెండురోజుల పాటు విశాఖపట్నంలోని మిథిలాపుర్ కాలనీలో అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ సత్య సాయి బాలవికాస్ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులంతా కలసి పాల్గొన్న ఈ సమ్మేళనంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల స్పీచెస్, నృత్యాలు, భజనలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జి. చలం మాట్లాడుతూ.. బాలవికాస్ విద్యార్థులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలకి పునాది లాంటి వారని అభివర్ణించారు. బాలవికాస్ బోధనా పద్ధతిని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్థాపించగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బాలవికాస్ గురువులకి, విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది సంవత్సరాలపాటు బాలవికాస్ బోధనా పద్ధతి ద్వారా నేర్చుకున్న మానవతా విలువలు, అంశాలు పిల్లలకు అన్ని విషయాల్లో పరిణతి కలిగించి సమాజ సేవలో పాల్గొనేలా, ఉన్నతమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో ఎంతగానో దోహద పడతాయని ఆయన అన్నారు.
వైభవంగా బాలవికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం - visakahapatnam
విశాఖలో సత్యసాయి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులంతా ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులుగా మారాలనీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు చలం ఆకాంక్షించారు.
![వైభవంగా బాలవికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4110864-687-4110864-1565579117209.jpg)
వైభవంగా బాలవికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
TAGGED:
visakahapatnam