విశాఖలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు - విశాఖలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు కరోనా నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేశారు. కొన్ని చోట్ల పేదలకు చీరలు, దుప్పట్లు పంచిపెట్టారు.
విశాఖలో లెజెండ్ బాలకృష్థ పుట్టిన రోజు వేడుకలు
విశాఖ జిల్లా అనకాపల్లిలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్క్ సెంటర్ వద్ద జరిపిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పేదలకు చీరలు, దుప్పట్లు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా నిబంధనలు పాటిస్తూ అభిమానులు బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.