ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంటల్లోనే ఛేదన... బాధితురాలికి బ్యాగ్ అందజేత - విశాఖ క్రైం న్యూస్

విశాఖపట్నంలో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగు అదృశ్యం ఘటనను పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. పోలీసుల అప్రమత్తతతో ఆటోడ్రైవర్​ నుంచి బ్యాగును స్వాధీనం చేసుకుని బాధిత మహిళకు అప్పగించారు.

bag missing case chased in vizag
గంటల్లోనే ఛేదన... బాధితురాలికి బ్యాగ్ అందజేత

By

Published : Dec 6, 2020, 1:34 AM IST

విశాఖపట్నంలోని ఆరిలోవకు చెందిన రాధిక సుమారు ఎనిమిది లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను ఓ బ్యాగులో పెట్టకుని... ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్స్​కు వచ్చింది. ఈ క్రమంలో బ్యాగ్​ను ఆటోలో మర్చిపోయింది. కాంప్లెక్స్​లోకి వెళ్లిన తర్వాత బంగారం ఉన్న బ్యాగు లేదనే విషయాన్ని గమనించి... స్థానిక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమై ఆటోను గుర్తించి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో రాధికకు బ్యాగును అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details