ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్​కు చేదు అనుభవం - పెద నాగమయ్య పాలెం వార్తలు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్​కు చేదు అనుభవం ఎదురైంది. ఓ సంస్థ ఆర్థిక సహాయంతో నిత్యావసర సరకులు సమకూరిస్తే... వైకాపా ఆధ్వర్యంలో పంపిణీ అని చెప్పుకోవడం ఏంటని మంత్రిని తెదేపా కార్యకర్తలు ప్రశ్నించారు. ఈ పరిణామంతో సరకుల పంపిణీ కార్యక్రమం కాస్త రాజకీయ నినాదాలకు వేదికైంది.

minister avanthi srinivasa rao
minister avanthi srinivasa rao

By

Published : May 5, 2020, 9:48 PM IST

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్​కు చేదు అనుభవం

విశాఖ జిల్లా భీమిలి మండలం పెద నాగమయ్యపాలెంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్న నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. దివిస్ లేబొరేటరీస్ ఆర్థిక సహాయంతో నిత్యావసర సరకులు సమకూరిస్తే... వైకాపా ఆధ్వర్యంలో పంపిణీ అని చెప్పుకోవడం సమంజసం కాదని స్థానిక తెదేపా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనంతరం మాట్లాడిన మంత్రి... ప్రజా సమస్యలు చెప్పకుండా రాజకీయాలు మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య మాటల యుద్ధం సాగింది. ఓ దశలో మంత్రి చెప్పినా వారు వినిపించుకోకపోవటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. చివరకు ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details