Baby turtles released into sea: అంతరించే ప్రమాదమున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లల్ని విశాఖ జిల్లా అటవీ శాఖ అధికారులు సముద్రంలోకి విడిచిపెట్టారు. విశాఖ జోడుగుల్ల పాలెం బీచ్ వద్ద జరిగిన కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, పర్యావరణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యతకు దోహదం చేసే మొత్తం 50 వేల తాబేళ్లను సంద్రంలోకి వదిలిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ ఎన్టీపీసీ(NTPC) వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇప్పటికే 8 వేల తాబేళ్ల పిల్లల్ని విడిచి పెట్టినట్లు పేర్కొన్నారు. విశాఖ ఆర్కే బీచ్‌తో పాటు మరో ఐదు ప్రాంతాల్లో సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Baby Turtles: అద్బుత దృశ్యం.. సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలిన అధికారులు - విశాఖలోని సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లల్ని వదిలిన అధికారులు
Baby turtles released into sea: ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లల్ని విశాఖ జిల్లా అటవీ శాఖ అధికారులు సముద్రంలోకి విడిచిపెట్టారు. పర్యావరణ సమతుల్యతకు దోహదం చేసే మొత్తం 50 వేల తాబేళ్లను.. సంద్రంలోకి వదిలిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లల్ని సంద్రంలోకి వదిలిన అటవీ అధికారులు