సుఖ ప్రసవంతో పండంటి బిడ్డలకు జన్మనివ్వాలని అకాంక్షిస్తూ అగనంపూడి ప్రాంతానికి చెందిన గర్భిణీలకు సత్యసాయి సేవా సంస్థ సీమంతం నిర్వహించింది. ప్రతీ నెలా 19వ తేదీన మహిళ శక్తి స్వరూపిణి దినోత్సవం జరుపుకోవడం ఇక్కడ అనవాయితీ. సత్య సాయి సేవా సంస్థల మహిళా విభాగం ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతుంది. అగనంపూడి ప్రాంతానికి చెందిన 19 మంది గర్భిణీలకు పసుపు, కుంకుమ, గాజులు వంటి వివిధ వస్తువులను అందించి సీమంతం కార్యక్రమం నిర్వహించారు. జయ కామేశ్వరి బృందం ఈ కార్యక్రమానికి సారధ్యం వహించారు.
సుఖ ప్రసవంతో పండంటి బిడ్డలకు జన్మనివ్వాలని సీమంతం - అగనంపూడి తాజా వార్తలు
సుఖ ప్రసవంతో పండంటి బిడ్డలకు జన్మనివ్వాలని అకాంక్షిస్తూ గర్భిణీలకు సత్యసాయి సేవా సంస్థ సీమంతం నిర్వహించింది. విశాఖలోని అగనంపూడి ప్రాంతానికి చెందిన గర్భిణీలకు పసుపు, కుంకుమ, గాజులు వంటి వివిధ వస్తువులను అందించి.. సీమంతం కార్యక్రమం చేపట్టారు.
పండంటి బిడ్డలకు జన్మనివ్వాలని సీమంతం ఏర్పాటు