మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. వైకాపా ప్రధాన కార్యాలయంలోని బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పార్టీ కార్యకర్తలు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి సమాజంలోని పీడిత ప్రజల అభ్యున్నతికి విశేష కృషి చేసిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని మంత్రి తెలిపారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.