వచ్చే ఏడాదికి దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్నందున " ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ " పేరిట జాతీయ స్థాయిలో ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా విశాఖలో 75 మంది నేవల్ డాక్ యార్డు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సుమారు 5 వేల కిలోమీటర్ల దూరం సాగనున్న ఈ ర్యాలీని షిప్ బిల్డింగ్ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్ ప్రారంభించారు. దేశీయ పరిశ్రమలు డాక్ యార్డుతో భాగస్వాములుగా తమ సామర్ద్యాన్ని ప్రదర్శిస్తున్న తీరును శ్రీనివాస్ తెలియజేశారు. 12 ప్రధాన నగరాల్లో భారతీయ పరిశ్రమలను సందర్శించడమే కాకుండా దారి పొడవునా చిన్న మధ్య తరహా పరిశ్రమ వర్గాలతో సంభాషించి ఆత్మ నిర్భర్ భారత్లో సాధించిన పురోగతి గురించి యాత్రలో భాగంగా తెలుసుకోనున్నారు.
వచ్చే ఏడాది వరకు వజ్రోత్సవం..