ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల స్థలాల పట్టాలు వెంటనే మంజూరు చేయాలి: అయ్యన్న - జగన్​పై అయ్యన్నపాత్రుడు కామెంట్స్

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలను వెంటనే మంజూరు చేయాలని తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. స్థలం కేటాయింపుల్లో కూడా రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపించారు.

ఇళ్ల స్థలాల పట్టాలు వెంటనే మంజూరు చేయాలి: అయ్యన్న
ఇళ్ల స్థలాల పట్టాలు వెంటనే మంజూరు చేయాలి: అయ్యన్న

By

Published : Nov 7, 2020, 3:33 PM IST

విశాఖ జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామంలో ముంపు ప్రాంతాన్ని అయ్యన్నపాత్రుడు సందర్శించారు. వైకాపా ప్రభుత్వం ఈ ప్రాంతంలో సుమారు నూట ఇరవై నాలుగు మందిని గుర్తించిందని.. వర్షాలకు ముంపునకు గురయ్యే ప్రదేశంలో స్థలాలు కేటాయించడం తగదన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొని స్థలాలు పంపిణీ చేయడం సరికాదని అయ్యన్న సూచించారు. తాండవ జలాశయం నీటి ప్రవాహంతో ఇబ్బందిపడే ప్రమాదం ఉందని దీనిపై చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. గ్రామంలోని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details