రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున అయ్యన్నపాత్రుడు ప్రచారం నిర్వహించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన కేవలం ఇరవై నెలల్లోనే అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను జగన్మోహన్ రెడ్డి తాను మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకోవడం తగదని అన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది: అయ్యన్నపాత్రుడు - విశాఖ జిల్లా తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన కేవలం ఇరవై నెలల్లోనే అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి తాను మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకోవడం తగదని హితవు పలికారు.
అయ్యన్నపాత్రుడు
పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం..
నర్సీపట్నంలోని శారదానగర్ 21వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. అనంతరం ఎన్నికల కోసం ముద్రించిన గోడ పత్రిక, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ప్రధానంగా 21 వార్డుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఉమ్మారెడ్డి శృతి అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.