పంచాయతీ ఎన్నికల కోసం విశాఖ జిల్లా మాకవరపాలెం మండల సర్పంచ్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెదేపా నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిందని అయ్యన్నపాత్రుడు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వీటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
'గ్రామ, వార్డు స్థాయి కార్యకర్తలంతా చిత్తశుద్ధితో పని చేయాలి'
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల కోసం విశాఖ జిల్లా మాకవరపాలెం మండల సర్పంచ్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.
'గ్రామ, వార్డు స్థాయి కార్యకర్తలత్తా చిత్తశుద్ధితో పని చేయాలి'
తెలుగుదేశం పార్టీ మద్దతుతో.. అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని చెప్పారు. అందుకు గ్రామ, వార్డు స్థాయి కార్యకర్తలత్తా చిత్తశుద్ధితో పని చేయాలని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల ప్రజాభిప్రాయాన్ని వెల్లడించి.. ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
సీహెచ్సీపై రోగి బంధువులు దాడి.. వైద్యసిబ్బంది ఆందోళన
Last Updated : Jan 29, 2021, 12:09 AM IST