ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాణాసంచా విక్రయాలకు షరతులతో కూడిన అనుమతినివ్వండి' - సబ్ కలెక్టర్​కు అయ్యన్న వినతిపత్రం

విశాఖ జిల్లా నర్సీపట్నంలో బాణాసంచా విక్రయాలకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేయాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సబ్​కలెక్టర్​ను కోరారు. బాణాసంచా విక్రయాల ద్వారా 100 నుంచి 150 కుటుంబాలు జీవనోపాధి పొందుతాయని..., వారిని దృష్టిలో పెట్టుకొని అనుమతినివ్వాలన్నారు.

'బాణాసంచా విక్రయాలకు షరతులతో కూడిన అనుమతినివ్వండి'
'బాణాసంచా విక్రయాలకు షరతులతో కూడిన అనుమతినివ్వండి'

By

Published : Nov 13, 2020, 4:18 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో బాణాసంచా విక్రయాలకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేయాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ మేరకు స్థానిక సబ్ కలెక్టర్​కు సామాజిక మాధ్యమం ద్వారా సమాచారమిచ్చి విజ్ఞప్తి చేశారు. దీపావళి సందర్భంగా మున్సిపాలటీ పరిధిలో 100 నుంచి 150 కుటుంబాలు బాణాసంచా విక్రయాలు జరిపి జీవనోపాధి పొందుతారని వ్యాఖ్యానించారు. వారి జీవోనోపాధిని దృష్టిలో ఉంచుకొని షరతులతో కూడిన అనుమతి మంజూరు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details