ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ప్రభుత్వ భూములు కాజేసే యత్నం: అయ్యన్న - tdp fires on ysrcp government

విశాఖలో విలువైన ప్రభుత్వ భూములు కాజేసే యత్నం జరుగుతోందని తెదేపా సీనియర్​ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రభుత్వ భవనాలు, భూములు తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

ayanna
ayanna

By

Published : Oct 4, 2021, 2:19 PM IST

విశాఖలో విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి యత్నించడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నా.. ఉత్తరాంధ్ర నాయకులు నోరుమెదపకపోవడం శోచనీయమన్నారు. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్రలో ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details