ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ayyanna: జగన్ అవినీతి పనులను వ్యతిరేకిస్తున్నందుకే నాపై కక్ష: అయ్యన్న - అయ్యన్నతాజా వార్తలు

జగన్ అవినీతి పనులను వ్యతిరేకిస్తున్నందునే తనపై కక్ష కట్టి.., ఇప్పటివరకు 9 కేసులు పెట్టారన్నారని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున లేటరైట్‌, బాక్సైట్‌ దోచేస్తున్నారని ఆరోపించారు.

జగన్ అవినీతి పనులను వ్యతిరేకిస్తున్నందుకే నాపై కక్ష
జగన్ అవినీతి పనులను వ్యతిరేకిస్తున్నందుకే నాపై కక్ష

By

Published : Feb 28, 2022, 8:47 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున లేటరైట్‌, బాక్సైట్‌ దోచేస్తున్నారని.. తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ ఖనిజమంతా కడప జిల్లాలో భారతి సిమెంట్‌కు తరలివెళుతోందన్నారు. అలాగే నర్సీపట్నం ఎమ్మెల్యే నాయకత్వంలో రంగురాళ్ల తవ్వకం, గంజాయి స్మగ్లింగ్‌ జరుగుతున్నాయని.. అయినా పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని అన్నారు. ఇలాంటి వాటిని ప్రశ్నిస్తే తమపై కేసులు పెడతారా ? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

జగన్ అవినీతి పనులను వ్యతిరేకిస్తున్నందునే తనపై కక్ష కట్టి.., ఇప్పటివరకు 9 కేసులు పెట్టారన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం సరికాదన్నారు. ప్రకృతి సంపదను దోచుకునే అధికారం వైకాపా నేతలకు లేదన్నారు. నర్సీపట్నంలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

"జగన్ అవినీతి పనులను వ్యతిరేకిస్తున్నందుకే నాపై కక్ష. నాపై ఇప్పటివరకు 9 కేసులు పెట్టారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం సరికాదు. ప్రకృతి సంపదను దోచుకునే అధికారం వైకాపా నేతలకు లేదు. నర్సీపట్నంలో అక్రమ మైనింగ్‌ను అధికారులు అడ్డుకోవాలి. ఖనిజ సంపదను దోపిడీ చేయడాన్ని చూస్తూ ఊరుకోం."- అయ్యన్నపాత్రుడు, తెదేపా నేత

ఇదీ చదవండి

Chandrababu: వివేకా కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషే: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details