అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మరిడిమాంబ ఉత్సవాలకు పోలీసుల అనుమతి కోరితే.. నిబంధనలతో కూడిన నోటీసులు జారీ చేయడంపై తెలుగుదేశం సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. వందల ఏళ్లుగా జరుగుతున్న మరిడిమాంబ మహాలక్ష్మి జాతర నిర్వహణకు అర్థంలేని నిబంధనలతో నోటీసులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిబంధనులు పాటిస్తే అసలు ఉత్సవాలు జరపలేమన్నారు. ఉత్సవాలపై ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని అయ్యన్న స్పష్టం చేశారు.
వందల ఏళ్లుగా జరుగుతున్న జాతరకు పోలీసుల ఆంక్షలా ?: అయ్యన్న
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించే మరిడిమాంబ ఉత్సవాలకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెదేపా నేత అయ్యన్న మండిపడ్డారు. వందల ఏళ్లుగా జరుగుతున్న జాతరకు ఆంక్షలు విధించమేంటని ప్రశ్నించారు. పోలీసుల నిబంధనలు పాటిస్తే అసలు ఉత్సవాలు జరపలేమన్నారు.
వందల ఏళ్లుగా జరుగుతున్న జాతరకు పోలీసుల ఆంక్షలా ?