జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి అధినేత చంద్రబాబుకు కానుక ఇస్తామని...మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైకాపాకు మద్దతు ప్రకటించినందున స్థానిక నాయకులతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వాటి నుంచి దృష్టి మరల్చడానికే ఒక్కొక్క ఎమ్మెల్యేను లాగుతున్నారని ఆరోపించారు. జగన్ కు నిజాయితీ లేదని....55 మంది సలహాదారులు ఏమి సలహాలు ఇస్తున్నారని...వారు అవసరమా అని ప్రశ్నించారు.
55 మంది సలహాదారులు అవసరమా ?: అయ్యన్న - చింతకాయల అయ్యన్న పాత్రుడు న్యూస్
రాజకీయ స్వార్థం కోసమే వాసుపల్లి గణేశ్ తెదేపాకు ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వాటి నుంచి దృష్టి మరల్చడానికే ఒక్కొక్క ఎమ్మెల్యేను లాగుతున్నారని ఆరోపించారు. 55 మంది సలహాదారులు జగన్కు ఏం సలహాలు ఇస్తున్నారని...వారు అవసరమా అని ప్రశ్నించారు.
55 మంది సలహాదారులు అవసరమా ?: అయ్యన్న