ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ayyanna: మూడేళ్లలో జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి: అయ్యన్న - అయ్యన్న లేటెస్ట్ న్యూస్

ayyanna fire on cm Jagan: జగన్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆక్షేపించారు. మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.

మూడేళ్లలో జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి
మూడేళ్లలో జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి

By

Published : May 22, 2022, 8:51 PM IST

ayyanna fire on YSRCP govt: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. నర్సీపట్నంలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగితే.. ఈ రోజు వరకు న్యాయం జరగలేదని అన్నారు. నర్సీపట్నంలో జరిగి మినీ మహానాడులో ఆయన పాల్గొన్నారు. అనకాపల్లి బెల్లం ప్రపంచ వ్యాప్తంగా పేరొందిందన్న అయ్యన్న.. ఆంక్షలు పెట్టి రైతులను నష్టాలపాలు చేశారన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని ఆక్షేపించారు.

మూడేళ్లలో జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి

ABOUT THE AUTHOR

...view details