ఈఎస్ఐ కుంభకోణంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు సంబంధం ఉందంటూ కొన్ని ఆధారాలు విడుదల చేసిన తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈఎస్ఐ కుంభకోణం నిందితుడికి మేలు చేసేందుకు... మంత్రి కుమారుడు బెంజ్ కారు తీసుకున్నారని ఆరోపించారు. తన ఆరోపణలపై టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా... ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదని అన్నారు. అనిశా వద్ద అయినా న్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేస్తున్నానని అయ్యన్న వ్యాఖ్యనించారు. అనిశా వద్ద కదలిక లేకపోతే గవర్నర్ను కలుస్తామని స్పష్టం చేశారు. మంత్రి అవినీతి గురించి గవర్నర్‌కు వివరిస్తానని అయ్యన్న తేల్చిచెప్పారు. అనిశా అధికారులు విచారణ చేస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి జయరాంపై అనిశాలో అయ్యన్న ఫిర్యాదు - ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి జయరాం
మంత్రి జయరాంపై తెదేపా నేత అయ్యన్న పాత్రుడు అనిశాకు ఫిర్యాదు చేశారు. ఈఎస్ఐ కుంభకోణం నిందితుడికి మేలుచేసేందుకు మంత్రి కుమారుడు బెంజ్ కారు తీసుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై అనిశా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లేకుంటే గవర్నర్ను కలుస్తానని స్పష్టం చేశారు.
మంత్రి జయరాంపై అనిశాకు ఫిర్యాదు చేసిన అయ్యన్న