పరిశ్రమల్లో ఉపయోగించే మిథనాల్, ఇతర రసాయనాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా చూడాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అర్బన్ విభాగం ప్రత్యేక అధికారి అజిత్ వేజెండ్ల చెప్పారు. విశాఖ రాంకీ హబ్లో... పరిశ్రమల్లో మిథనాల్, ఇతర రసాయనాల వాడకంపై ఆయన ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది.
విశాఖ జిల్లాలోని పరవాడ, భీమిలి, గాజువాక, పెందుర్తి ప్రాంతాలకు చెందిన వివిధ ఫార్మా సంస్థల నుంచి 120 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరికి పరిశ్రమల్లో రసాయనాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు సూచించారు. జిల్లా ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.