PLASTIC BAN RALLY: ప్లాస్టిక్ వాడకం నిషేధంపై విశాఖ రైల్వేస్టేషన్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. జీవీఎంసీ రైల్వే వాల్తేర్ డివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్, రైల్వే పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాల్తేర్ డీఆర్ఎం అనూప్ సత్పతి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ, భారత క్రికెటర్ శ్రీకర్ భరత్‌లు పాల్గొన్నారు. విశాఖ రైల్వేస్టేషన్ నుంచి నగరంలోకి వెళ్లే ప్రయాణికులకు సూచనలతో కూడిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధంపై రైల్వే కళాకారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
PLASTIC BAN RALLY: విశాఖలో ప్లాస్టిక్ వాడక నిషేధంపై అవగాహన ర్యాలీ.. - ap latest news
PLASTIC BAN RALLY: ప్లాస్టిక్ ప్రజల జీవితాల్లో ఒక భాగమైంది. చేతి సంచిని నమోషీగా భావించి.. మన అనారోగ్యాలకు కారణమైన ప్లాస్టిక్‌ను మాత్రం పదిలంగా మోసుకొస్తున్నాము. ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ప్రజలలో మాత్రం చైతన్యం రావడంలేదు. ప్లాస్టిక్ వాడకం వల్ల భావితరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాము. తాజాగా ప్లాస్టిక్ వాడకం నిషేధంపై విశాఖ రైల్వేస్టేషన్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు.
PLASTIC BAN RALLY