ప్రపంచ ప్రజానీకాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల సామాన్యులకు అవగాహన కలిగించేందుకు విశాఖ విద్యార్థులు కృషి చేస్తున్నారు. సెవెంత్ డే అడ్వైంటీస్ పాఠశాల విద్యార్థులు నగరంలోని ఎంవీపీ రైతు బజార్లో కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ లక్షణాలు ఏమిటి.. ఆ వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్కులు ధరించడం వల్ల ప్రయోజనాలు.. చేతులు కడుక్కోవడం వల్ల వైరస్ వ్యాప్తిని ఏ విధంగా అరికట్టవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు.
విశాఖలో కరోనాపై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు - విశాఖలో కరోనాపై అవగాహన
కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెవెంత్ డే అడ్వైంటీస్ పాఠశాల విద్యార్థులు నడుం బిగించారు. బ్యానర్లు, ప్లకార్డులతో రైతుబజారుకి వచ్చే సామాన్యులకు అవగాహన కల్పిస్తున్నారు.
![విశాఖలో కరోనాపై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు Awareness rally on Corona virus in Vishakhapatanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6365654-7-6365654-1583900810905.jpg)
Awareness rally on Corona virus in Vishakhapatanam