విశాఖ జిల్లా చోడవరంలో లాక్డౌన్పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. ఉదయం పూట వాకింగ్ వారికి సామాజిక దూరం, ఆరోగ్య సూత్రాలపై ట్రైనీ డీఎస్పీ రవికిరణ్ అవగాహన కల్పించారి. లాక్డౌన్ అమలవుతున్నందున ప్రతి పంచాయతీలో నలుగురితో బృందం ఏర్పాటు చేసి గస్తీ చేస్తున్నామన్నారు. సరిహద్దులో చెక్ పోస్టు పెట్టి అనుమతి లేని వాహనాలు స్వాధీనపర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
భౌతిక దూరం, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం - చోడవరంలో లాక్ డౌన్ పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం పోలీసులు చేపట్టారు
విశాఖ జిల్లా చోడవరంలో కరోనా నియంత్రణలో భాగంగా అమలవుతున్న లాక్డౌన్పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం పోలీసులు చేపట్టారు. భౌతిక దూరం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
లాక్ డౌన్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం