ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 18, 2021, 3:36 PM IST

ETV Bharat / state

గిరి మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

విశాఖ మన్యంలో విశాఖ రోటరీ క్లబ్,​ ఆరోహణ స్వచ్ఛంద సంస్థ... ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో ప్రజల జీవన స్థితిగతులు మార్చేందుకు తమ వంతు సాయం చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

awareness program on health at vishaka agency
గిరి మహిళలు చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం ముసిరి గొంది గూడలో విశాఖ రోటరీ క్లబ్, ఆరోహణ స్వచ్ఛంద సంస్థ పర్యటించింది. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి.. మహిళలకు ఉచితంగా శానిటైజర్, మాస్కులు, శానిటరీ నాప్​కిన్​లను అందజేశారు.

గిరి మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని గుర్తించామనీ.. వారిలో ఆరోగ్యంపై చైతన్యం కల్పించేందుకు వీలుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు రోటరీ క్లబ్ ప్రతినిధి వెంకన్న చౌదరి తెలిపారు. గిరిజిన ప్రాంతంలోని ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు తమవంతుగా కృషి చేస్తున్నామని ఆరోహణ సంస్థ ప్రతినిధి రాణి ముఖర్జీ తెలిపారు.

ఇదీ చదవండి:దిల్లీ దీక్షలో అనకాపల్లి వాసులు

ABOUT THE AUTHOR

...view details