వృక్ష మిత్ర సమితి, ఈనాడు- ఈటీవీల ఆధ్వర్యంలో... విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొసర్ల పూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెుక్కలు నాటే కార్యక్రమం జరిగింది. మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చునని నర్సీపట్నం ఏఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు. మొక్కలు పెంచడాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమంగా తీసుకోవాలని నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు పిలుపునిచ్చారు. మెుక్కలు వేసి, అవి చెట్ల స్థాయికి ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ ఏడాదికి సంబంధించి నర్సీపట్నం డివిజన్లో 18 లక్షల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా తీసుకున్నామని నర్సీపట్నం డివిజినల్ అటవీ అధికారి వేణుగోపాల రావు అన్నారు. ఇప్పటికే సుమారు మూడు లక్షల మొక్కలు పంపిణీ చేశామన్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
కొసర్లపూడిలో... పర్యావరణంపై అవగాహన సదస్సు - కొసర్లపూడిలో పర్యావరణంపై అవగాహన సదస్సు నిర్వహణ
వృక్ష మిత్ర సమితి, ఈనాడు- ఈటీవీల ఆధ్వర్యంలో కొసర్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెుక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ మేరకు నర్సీపట్నం ఏఎస్పీ, ఆర్డీవో, డివిజినల్ అటవీ అధికారి పాల్గొని పర్యావరణంపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.
కొసర్లపూడిలో పర్యావరణంపై అవగాహన సదస్సు నిర్వహణ