కరోనా సమయంలో విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేయించారంటూ.. జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి పని తీరును ప్రజా సంఘాల నేతలు ప్రశంసించారు.
ప్రజల్లో అవగాహన కల్పించేలా జీవీఎంసీ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపారన్నారు. జోనల్ కమిషనర్‌ను సత్కరించారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు బొడ్డేడ అప్పారావు, ప్రవీణ్ కుమార్, చిన్ని యాదవ్ పాల్గొన్నారు.