ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇళ్లపట్టాలు పంపిణీ చేశాం'

ఒక్క రూపాయి అవినీతి లేకుండా రాష్ట్రంలో ఇళ్లపట్టాలు పంపిణీ చేశామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ జిల్లా సింహాచలంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా 31 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలిచ్చామన్నారు.

'ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇళ్లపట్టాలు పంపిణీ చేశాం'
'ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇళ్లపట్టాలు పంపిణీ చేశాం'

By

Published : Jan 1, 2021, 6:01 PM IST

ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 80 శాతానికిపైగా పూర్తి చేశారని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా పేదలకు 31 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న మంత్రి... అనంతరం ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఒక్క రూపాయి అవినీతి లేకుండా రాష్ట్రంలో ఇళ్లపట్టాలు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఇంక ఎవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవాలని, 90 రోజుల్లో పట్టాలు మంజూరు చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సింహాచల భూసమస్యను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు.

సింహగిరిపై భక్తుల రద్దీ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సింహాద్రి అప్పన్న సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..అలయ అధికారులు భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

ఇదీచదవండి

'జనవరి 6 తరువాత ఆ మంత్రి రాజకీయ విరమణ'

ABOUT THE AUTHOR

...view details