ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజాసేవలో ఏడాది పూర్తిచేసుకోవడం సంతృప్తినిచ్చింది' - మంత్రిగా ఏడాది పూర్తి చేసుకోవడంపై అవంతి కామెంట్స్

రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా విశాఖ జిల్లా ఆనందపురంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఏడాదిలో ప్రజలకు చేసిన సేవలు సంతృప్తినిచ్చాయని మంత్రి అన్నారు.

ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ముత్తంశెట్టి శ్రీనివాసరావు

By

Published : Jun 8, 2020, 6:10 PM IST

రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ జిల్లా ఆనందపురంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేశారు.

ఏడాది పాలనలో అందించిన సేవలు సంతృప్తినిచ్చాయని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. ప్రజా సంక్షేమానికి నిరంతరాయంగా శ్రమిస్తున్నానన్నారు. లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంకు పర్యవేక్షణలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది వైకాపా కార్యకర్తలు రక్తదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details